ఉహాలకు అందని విజయంతో.. బిజెపి సంబురాలు.

హర్యానా అధికారిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బిజెపి 48, కాంగ్రెస్ 37 స్థానాల్లో విజయం సాధించాయి.

By Kalasani Durgapraveen  Published on  9 Oct 2024 6:05 AM GMT
ఉహాలకు అందని విజయంతో.. బిజెపి సంబురాలు.

హర్యానా అధికారిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బిజెపి 48, కాంగ్రెస్ 37 స్థానాల్లో విజయం సాధించాయి. రాష్ట్రంలో ఒక పార్టీ వరుసగా మూడు సార్లు గెలవడం ఇదే తొలిసారి. 2019 ఎన్నికల్లో బీజేపీ 40 సీట్లతో మెజారిటీ మార్కును దాటలేకపోయినప్పటికీ జేజేపీ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. హరియాణాలో 5 ఏళ్ల చొప్పున రెండు దఫాలు కూటమితో ప్రభుత్వాన్ని పూర్తి చేసుకుని.. తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటైందన్నారు.

జులానా స్థానం నుంచి రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేశ్ ఫోగట్, గర్హి సంప్లా-కిలోయ్ స్థానం నుంచి హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా, స్వతంత్ర అభ్యర్థి సావిత్రి జిందాల్, హర్యానా సీఎం నయాబ్ సింగ్ విజయం సాధించారు.హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి), కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), జననాయక్ జనతా పార్టీ (జెజెపి), ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డి) ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని బీజేపీ భావించగా ..హర్యానాలో దశాబ్దకాలంగా కొనసాగుతున్న బిజెపి ప్రభుత్వానికి తెరదించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ భావిచింది. అయిన హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Next Story