కరోనా వైరస్‌ సోకిన మహిళకు లైంగిక వేధింపులు

By సుభాష్  Published on  7 May 2020 3:56 PM GMT
కరోనా వైరస్‌ సోకిన మహిళకు లైంగిక వేధింపులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తోంది. దీంతో కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ అమలు కొనసాగుతోంది. ఒకరి నుంచి ఒకరికి అతివేగంగా వ్యాపించే ఈ వైరస్‌తో ప్రపంచ దేశాలను కంటినిండా నిద్రకుండా చేస్తోంది. కరోనా కాలంలో కూడా కామాంధులు రెచ్చిపోతున్నారు. పూర్తిగా బరితెగించిపోతున్నారు. కరోనా సోకిన ఓ మహిళపై కొందరు కామాంధులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. కరోనా సోకుతుందేమోనన్న సోయి కూడా లేకుండా పోతోంది.

తాగాజా యూపీలోని నోయిడాలో జరిగిన ఇలాంటి ఘటన కలకలం రేపుతోంది. కోవిడ్‌-19 పాజిటివ్‌తో 22 ఏళ్ల మహిళ గ్రేటర్‌ వోయిడాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. అయితే ఆస్పత్రిలో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆమెపై లైంగికంగా వేధించడం మొదలు పెట్టారు. చివరికి సదరు మహిళ పోలీసుల దృష్టికి తీసుకువచ్చింది. దీంతో ఇద్దరు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా, సదరు మహిళ ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని వైద్యాధికారులు తెలిపారు. ఆమెను లైంగికంగా వేధిస్తున్న ఇద్దరు ఆస్పత్రి సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతేకాదు వారిని ఆస్పత్రి విధుల నుంచి తొలగించారు. కాగా, ముందే కరోనా భయంతో సామాజిక దూరం పాటించాలని అధికారులు మరి మరి చెబుతున్నా.. కొందరు కరోనా సోకుతుందేమోనన్న విషయం మర్చిపోయి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారంటే వారు ఎలాంటి వారే ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

Next Story