బ్రేకింగ్: ఏపీ: పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
By సుభాష్Published on : 11 May 2020 9:53 AM IST

దేశంలో అగ్నిప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాగాజా గుంటూరు జిల్లా పిడుగురాళ్ల శివారులోని వాల్‌కేర్ అండ్ పెయింట్స్ పరిశ్రమలో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన రంగల డబ్బాలన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి.
స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రంగు డబ్బాలతో పాటు ఇతర సామాగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. షాట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జగినట్లు భావిస్తున్నారు.
Also Read
నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదంNext Story