నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం
By సుభాష్ Published on 10 May 2020 10:58 AM IST
హైదరాబాద్ నాంపల్లి రాయల్ స్ర్కాప్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గోడౌన్‌లో ఉన్న కంప్రెసర్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది.
కాగా, ఈ మధ్యన అగ్నిప్రమాదాలు కూడా భారీగానే జరుగుతున్నాయి. నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్న ఈ అగ్నిప్రమాదాల వల్ల భారీగానే ఆస్తినష్టం సంభవిస్తున్నాయి.
అలాగే మే 7వ తేదీన కూడా సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం దాయారా పంచాయతీ పరిధిలోని గండిగూడ పారిశ్రామికవాడలో స్ర్కాప్ గోదాములో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో భారీగానే ఆస్తినష్టం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
అలాగే గత బుధవారం ఢిల్లీలోని త్రిక్రీ బోర్డర్ ఏరియాలో ఓ గోదాంలో కూడా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది 30 ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పొగలు కమ్ముకున్నాయి. భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో పరిసర ప్రజలు భయభ్రాంతులకు గుయ్యారు. ఆ ప్రమాదంతో నష్టం భారీగానే ఉందని అధికారులు అంచనా వేశారు. ఇలా ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరుగుతూనే ఉంది.
[video width="640" height="288" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/05/WhatsApp-Video-2020-05-10-at-7.47.17-AM.mp4"][/video]