భారత్‌లో నానాటికి పెరుగుతున్న నిరుద్యోగం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Nov 2019 6:49 PM IST
భారత్‌లో నానాటికి పెరుగుతున్న నిరుద్యోగం..!

ఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్‌లో దేశంలో నిరుద్యోగ రేటు మూడేళ్ల గరిష్టానికి పెరిగి 8.5 శాతంగా ఉంది. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వెల్లడించింది. 2016 ఆగస్ట్ తరువాత ఇదే అత్యధికం. సెస్టెంబర్‌లో నిరుద్యోగ రేట్ 7.2 శాతంగా ఉంది. కీలక రంగాల ఉత్పత్తి భారీగా తగ్గడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. సెప్టెంబర్‌లో ఉత్పత్తి 5.2 శాతం క్షీణించింది. గత ఏడాది ఇదే నెలలో కీలక రంగాలు 4.3 శాతం వృద్ధి సాధించాయి.

Next Story