శుభవార్త: దేశంలో రోడ్డెక్కనున్న బస్సులు.. కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

By సుభాష్  Published on  1 May 2020 4:02 PM GMT
శుభవార్త: దేశంలో రోడ్డెక్కనున్న బస్సులు.. కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ లాక్‌డౌన్‌ పకడ్బందీగా కొనసాగుతోంది. ఇక మే 3తో లాక్‌డౌన్‌ ముగియనుండంతో మళ్లీ 17వ తేదీ వరకూ పొడిగిస్తూ కేంద్రం ప్రకటించింది. అయితే ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో రెడ్‌ జోన్‌, ఆరెంజ్‌ జోన్‌, గ్రీన్‌ జోన్‌లను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇక గ్రీన్‌ జోన్‌, ఆరెంజ్‌ జోన్‌లలో కొన్ని సడలింపులు ఇవ్వనున్నట్లు తెలిపింది.

గ్రీన్‌ జోన్, ఆరెంజ్‌ జోన్‌ ప్రాంతాల్లో 50శాతం బస్సులు తిరిగేందుకు అనుమతి ఇచ్చింది. అంతేకాదు వ్యక్తిగత వాహనాలకు అనుమతి ఇచ్చింది. కార్లలో మాత్రం ఇద్దరు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించింది. ఆరేంజ్‌, గ్రీన్‌జోన్‌లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు.

విమానాలు, రైళ్లు, అంతర్జాతీయ ప్రయాణాలపై ఎలాంటి సడలింపులు ఉండవు. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు, సినిమా హాళ్లు, హోటళ్లు, జీమ్‌లు, స్విమ్మింగ్‌ ఫూల్స్‌, స్టేడియంలు మూసి ఉండనున్నాయి. అంతేకాదు.. గ్రీన్‌ జోన్‌లలో మద్యం షాపులు, పాన్‌ షాపులు నడిపేందుకు అనుమతి కూడా ఇచ్చింది.

Next Story