రాసిన ప‌రీక్ష‌ల ఆధారంగానే ర్యాంకులు.. మిగిలిన ప‌రీక్ష‌లు ర‌ద్దు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 May 2020 2:50 AM GMT
రాసిన ప‌రీక్ష‌ల ఆధారంగానే ర్యాంకులు.. మిగిలిన ప‌రీక్ష‌లు ర‌ద్దు

పదో తరగతి పరీక్షలపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా కొన్ని పరీక్షలు జరిగిన త‌ర్వాత‌.. మిగతా పరీక్షలు వాయిదా ప‌డ్డ విష‌యం తెలిసిందే. అయితే ఈ విష‌య‌మై ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌.. పెండింగ్ పరీక్షలను నిర్వహించడం లేద‌ని ప్ర‌క‌టించారు.



అయితే.. ఇప్పటివరకూ జరిగిన పరీక్షలలో విద్యార్ధులకు వ‌చ్చిన‌‌ ఫలితాల ఆధారంగానే మెరిట్ లిస్టును తయారు చేయాలని నిర్ణయించింది. ఇదిలావుంటే.. రాష్ట్రంలో ప‌ద‌వ త‌ర‌గ‌తి విద్యార్థులకు మార్చి 3 నుంచి 27 వరకూ పరీక్షలు జరగాల్సి వుండగా.. కొన్ని పరీక్షలు ఆగిపోయాయి. అలాగే.. వాయిదాప‌డ్డ‌ ఇంటర్ పరీక్షలను జూన్ 8 నుంచి 16 మధ్య నిర్వహించనున్న‌ట్లు ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు.

Next Story