టెన్షన్ లో 'గోపీచంద్'.. అసలు ఏమైంది..?
By Medi Samrat
'తొలివలపు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత విలన్ గా మారి.. మళ్లీ హీరోగా సినిమాలు చేసి సక్సస్ సాధించిన హీరో గోపీచంద్. ఈ మధ్య గోపీచంద్ టైమ్ ఏం బాగోలేదు. జిల్, సౌఖ్యం, గౌతమ్ నంద, ఆక్సిజన్, ఆరడుగుల బుల్లెట్టు, పంతం.. ఇలా ఏ సినిమా చేసినా ఫ్లాప్ అవుతుంది తప్పా సక్సస్ మాత్రం రావడం లేదు. లేటెస్ట్ గా దసరాకి 'చాణక్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ... ఈ సినిమా కూడా మెప్పించలేకపోయింది.
దీంతో గోపీచంద్ బాగా టెన్షన్ పడుతున్నాడట. ప్రస్తుతం గోపీ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఐతే ఇక్కడ ఓ సమస్య ఉంది. ఇప్పుడు సెట్ మీదున్న సినిమాలకి ప్రీ - రిలీజ్ బిజినెస్ కావడం కష్టం. ఇప్పటివరకు ఎలాగెలాగో నెట్టుకొచ్చినా... ఇప్పుడు మాత్రం డెఫిషిట్ ల షీట్ మాత్రమే మిగులుతుంది. మరో హిట్ కొట్టేంత వరకు అంతే. అయితే... లోపం అంతా గోపీచంద్ ఎన్నుకునే కథల్లోనే ఉంది.
ఎందుకంటే... ఒకప్పుడు యాక్షన్ లవర్స్ ని తెగ ఆకట్టుకున్న గోపి ... ఇపుడు ఏ వర్గాన్ని ఇంప్రెస్స్ చేయలేకపోతున్నాడు. 'చాణక్య'కి థియేటర్ల రెంట్ల డబ్బులు కూడా రాలేదంటే.. గోపీచంద్ మార్కెట్ ఎంతలా పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. సంపత్ నందితో చేస్తున్న సినిమాతో అయినా విజయాన్ని సాధిస్తాడని ఆశిద్దాం.