2021 జులై వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 July 2020 12:48 PM GMT
2021 జులై వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్

కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో సంస్థల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగుల విషయంలో ఎటువంటి రిస్క్ లు తీసుకోవడం లేదు. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ ను ప్రకటించాయి. చాలా సంస్థలు ఈ ఏడాది చివరి వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందని చెప్పేయగా.. ఇంకొన్ని కంపెనీలు మరికొన్ని నెలలు పొడిగించే యోచనలో ఉన్నాయి. తాజాగా గూగుల్ సంస్థ వచ్చే సంవత్సరం వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్ ను ప్రకటించేసింది.

కోవిడ్ కేసులు పెరిగిపోతుండడంతో ఉద్యోగుల విషయంలో గూగుల్ యాజమాన్యం ఉద్యోగులందరికీ 2021 జూలై నెల వరకూ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అని ప్రకటించింది. ఈ మేరకూ ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులకు మరో ఆరు నెలల పొడగింపును ఈ ఉత్తర్వులు సూచిస్తున్నాయని గూగుల్ పేర్కొంది. గూగుల్‌లో 2లక్షల మంది రిగ్యూలర్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు సేవలందిస్తున్నారు. కరోనా సంక్షోభం పై కంపెనీలో గత వారం విస్తృత చర్చ జరిగిన అనంతరం సీఈఓ సుందర్ పిచాయ్ స్వయంగా వర్క్ ఫ్రం హోం గడువును పొడిగించేందుకు నిర్ణయించారు.

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చే వరకూ మునుపటిలా ఆఫీసులు తెరచే అవకాశం కనిపించడం లేదు. చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటును కలిపిస్తూ ఉండడమే కాకుండా.. ఉద్యోగులకు కావాలసిన చాలా సదుపాయాలను ఇళ్లల్లోనే కలిపిస్తూ ఉన్నాయి. వర్క్ స్టేషన్, ఇంటర్నెట్.. ఇంకా ఎన్నో సదుపాయాలను అందిస్తూ ఉన్నాయి. చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పెద్ద పెద్ద నగరాలను వదిలి సొంత ఊళ్లకు వెళ్లి సంస్థల కోసం పని చేస్తూ ఉన్నారు.

Next Story