కరోనా వ్యాక్సిన్లు ఇప్పటికే ఆయా దేశాలు రిజర్వ్ చేసుకున్నాయా..?

By సుభాష్  Published on  28 July 2020 9:26 AM GMT
కరోనా వ్యాక్సిన్లు ఇప్పటికే ఆయా దేశాలు రిజర్వ్ చేసుకున్నాయా..?

కరోనా మహమ్మారి నుండి ఉపశమనం లభించాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. ఇప్పటికే పలు ఫార్మా సంస్థలు వ్యాక్సిన్ విషయంలో సంతృప్తికరమైన ఫలితాలను వెల్లడిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ట్రయల్స్ ఆశాజనకంగా ఉండడంతో ఆయా దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్లు రిజర్వ్ చేసుకున్నాయని తెలుస్తోంది. యూరోపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్, ఓఈసిడి దేశాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. భారత్ కూడా వ్యాక్సిన్ల విషయంలో ముందంజలో ఉంది.

భారత్ కు చెందిన చాలా కంపెనీలు వ్యాక్సిన్లు తయారీలో ఉన్నాయి. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సిఐఐ), భారత్ బయోటెక్, జైడస్ కడీలా, బయోలాజికల్ ఈ అనే కంపెనీలు వ్యాక్సిన్లు తయారుచేస్తున్నాయి. సిఐఐ ఆస్ట్రా జెనికా సంస్థతో కలిసి భారత్ కు వ్యాక్సిన్లను తయారుచేస్తోంది. వ్యాక్సిన్లు సక్సెస్ అయితే 400 మిలియన్ల వ్యాక్సిన్లు ఈ ఏడాది చివరికి సమకూరుస్తామని చెబుతోంది.

అమెరికాకు చెందిన మోడెర్నా, ఫైజర్ సంస్థలు కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. మరో మూడు నెలల్లో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నాయి. తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ విజయవంతమైతే ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి రెగ్యులేటరీ అనుమతులు పొంది ఈ ఏడాది చివరినాటికి 5 కోట్ల మందికి రెండేసి డోసుల వ్యాక్సిన్లను సరఫరా చేస్తామని ఫైజర్ సంస్థ తెలిపింది. ఈ ఏడాది నవంబర్‌ నాటికే తమ వ్యాక్సిన్‌ సరఫరా ప్రారంభమవుతుందని స్పష్టతనిచ్చింది. వచ్చే ఏడాది చివరినాటికి మొత్తం130 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల సరఫరా చేయడానికి ఫైజర్‌ ప్రణాళికలు వేసుకుంటోంది. మొడెర్నా సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ తుది దశకు చేరుకుంది. 2021 నుంచి ఏడాదిలోగా 100 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపింది. మొడెర్నా, ఫైజర్‌ సంస్థలు మొత్తం 30,000 మందిపై మానవ పరీక్షలను ఇప్పటికే ప్రారంభించాయి. మోడెర్నా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం ఇదే తొలిసారి. ఆ సంస్థకు అమెరికా ప్రభుత్వం రూ.7500 కోట్ల నిధులు సమకూర్చింది.

యూరోపియన్ యూనియన్ కూడా 100-400 మిలియన్ల డోస్ ల వ్యాక్సిన్లు సమకూర్చుకోవడానికి ఒక్కో వ్యాక్సిన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఆస్ట్రా జెనికా, జె అండ్ జె, శాన్ ఓఫి, జిఎస్కె సంస్థలతో మాట్లాడుతూ ఉన్నారు. 2.7 బిలియన్ల డాలర్లు వ్యాక్సిన్ కొనుక్కోవడం కోసం వెచ్చించనుంది. జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ దేశాలు కూడా వ్యాక్సిన్ కొనుగోలుకోసం ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నాయి.

యునైటెడ్ కింగ్డమ్ ఇప్పటికే 60 మిలియన్ల ఆస్ట్రా జెనికా డోసుల కోసం ప్రీ-ఆర్డర్ ఇచ్చేసింది. జిఎస్కె- శాన్ ఓఫి సంస్థలతో 100 మిలియన్ల డోసుల కోసం చర్చలు జరుపుతోంది. ఒక మిలియన్ డాలర్లను వ్యాక్సిన్ల కోసం వెచ్చించనుంది.

జపాన్ కూడా వ్యాక్సిన్ల విషయంలో పెద్ద ఎత్తున డబ్బు వెచ్చించడానికి సిద్ధంగా ఉంది. జె అండ్ జె, శాన్ ఓఫీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. జపనీస్ డ్రగ్స్ ను తయారుచేసే దాయ్ చి సంస్థ, ఆస్ట్రా జెనికా సంస్థలు వ్యాక్సిన్లు జపాన్ కు సరఫరా చేయడానికి నిర్ణయించుకున్నాయి.

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో కరోనా భయం చెలరేగుతోంది. డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియన్ కు కరోనా సోకింది. వైద్య పరీక్షల్లో ఓబ్రియన్ కు పాజిటివ్ అని తేలింది. దీనిపై వైట్ హౌస్ ప్రకటన చేసింది. ఓబ్రియన్ కు కరోనా నిర్ధారణ అయిందని, ఆయన ప్రస్తుతం ఐసోలేషన్ లోకి వెళ్లారని తెలిపింది. క్వారంటైన్ లో ఉంటూ విధులు నిర్వర్తిస్తారని వెల్లడించింది. జాతీయ భద్రతా మండలి కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం ఉండదని స్పష్టం చేశాయి. రాబర్ట్ ఓబ్రియన్ ఈ నెలలో పారిస్ వెళ్లి ఓ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఆయనకు ఎక్కడ కరోనా సోకిందన్న దానిపై స్పష్టతలేదు.

Next Story