డీ అండ్‌ ఐ డైలాగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించిన‌ గుడ్‌ యూనివర్శ్‌

Good Universe hosted the D and I Dialogue event. గుడ్‌ యూనివర్శ్‌ సంస్ధ మాదాపూర్‌లోని బ్లూమ్‌ హోటల్‌లో డీ అండ్‌ ఐ డైలాగ్‌

By Medi Samrat  Published on  26 Jun 2022 11:30 AM GMT
డీ అండ్‌ ఐ డైలాగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించిన‌ గుడ్‌ యూనివర్శ్‌

గుడ్‌ యూనివర్శ్‌ సంస్ధ మాదాపూర్‌లోని బ్లూమ్‌ హోటల్‌లో డీ అండ్‌ ఐ డైలాగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించింది. 'డైవర్శిటీ అండ్‌ ఇన్‌క్లూజన్‌' పై అర్థవంతమైన సంభాషణలను చేయడమే లక్ష్యంగా ఈ ఇంటరాక్టివ్‌ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్‌, హైదరాబాద్‌ డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ తో పాటుగా పలు కార్పోరేట్‌ సంస్ధల ప్రతినిధిలు, డైవర్శిటీ అండ్‌ ఇన్‌క్లూజన్‌ హెడ్స్‌ తదితరులు పాల్గొన్నారు.

బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ కీలకోపన్యాసంతో కార్య‌క్ర‌మం ప్రారంభమైంది. డీ అండ్‌ ఐ ఆవశ్యకతను ఆయన వెల్లడించారు. ఎల్‌జీబీటీ+ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాము దేశవ్యాప్తంగా ప్రారంభించిన కార్యక్రమాలు 450కు పైగా గ్రూప్స్‌కు చేరువైందన్నారు. తెలుగు రాష్ట్రాలలో తాము పలు క్వీర్‌ ఉద్యమకారులు, సంస్ధలతో కలిసి పనిచేస్తున్నామని.. ఇక్కడ ఇంకా చేసేందుకు చాలా అవకాశముందన్నారు. ఎల్‌జీబీటీ+ హక్కులకు కట్టుబడిన ఎన్నో భారతీయ సంస్ధలతో కలిసి పనిచేస్తుండటం పట్ల గర్వంగా ఉన్నట్లు తెలిపారు.

అనంతరం డైవర్శిటీ అండ్‌ ఇన్‌క్లూజన్‌పై ఓ చర్చా కార్యక్రమం జరిగింది. దీనిలో నోవార్టిస్‌ డీ అండ్‌ ఐ గ్లోబల్‌ హెడ్‌ అపర్ణ పాఠక్‌ తో పాటుగా హర్ష రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఎల్‌జీబీటీక్యుఐఏ+ కమ్యూనిటీ వ్యక్తులకు సాంకేతికత నైపుణ్యాలైనటువంటి డాటా ఎనాలసిస్‌ , డిజిటల్‌ మార్కెటింగ్ తదితర అంశాలలో శిక్షణ అందించేందుకు ప్రాజెక్ట్‌ ఇంపాక్ట్ పేరుతో నూతన ప్రాజెక్ట్‌ ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌ను పలు కార్పోరేట్‌ సంస్ధల డీ అండ్‌ ఐ హెడ్స్‌ సహకారంతో అమలు చేయనున్నారు.

కార్యక్రమంలో భాగంగా గుడ్‌ యూనివర్శ్‌ ప్రచురించిన కాఫీ టేబుల్‌ బుక్‌ను ఆర్‌కెమ్‌ ఫార్మా –వీపీ కార్పోరేట్‌ ఎఫైర్స్‌, సీఎస్‌ఆర్‌ రవి కుమార్‌ పీసపాటి, స్టేట్‌ స్ట్రీట్‌ వీపీ హరీష్‌, నిమ్స్‌లో సీనియర్‌ మెడికో సోషల్‌ వర్కర్‌ పార్వతి గుజ్జారీ, శరత్‌ సిటీ సీఓఓ ఇంద్రనీల్‌ విడుదల చేశారు. డ్రాగ్‌ ఆర్టిస్ట్‌ పాత్రుని శాస్త్రి ప్రదర్శనలతో పాటుగా కిరణ్‌, సాజిత్‌లు తీసిన ఫోటో ప్రదర్శన సైతం చేశారు.















Next Story