ఏపీ రైతులకు మరో శుభవార్త
By సుభాష్ Published on 26 Jun 2020 6:28 AM GMTఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్ రాష్ట్ర రైతులకు మరో శుభవార్త వినిపించారు. 2018 రబీ పంటల బీమా సొమ్మును రైతులకు చెల్లించనన్నట్లు ప్రకటించారు. శుక్రవారం తన క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్రంలో 13 జిల్లాల్లోని 5,94,005 మంది రైతుల ఖాతాలకు రూ.596.36 కోట్లు నేరుగా డబ్బులు జమ చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో 2018 రబీ పంటల బీమా కింద ప్రభుత్వం బీమా కంపెనీలకు ప్రీమియంను చెల్లించలేదు. దీంతో రైతులకు చెల్లించాల్సిన రూ. 596.36 కోట్లు బీమా కంపెనీలు నిలిపివేశాయి. అప్పటి నుంచి రైతులకు బీమా డబ్బులు అందలేదు.
టీడీపీ సర్కార్ 2018 రబీ పంటల బీమా మొత్తాన్ని రైతులకు చెల్లించకుండా ఎగనామం పెట్టిన విషయాన్ని తెలుసుకున్న సీఎం .. వెంటనే కంపెనీలకు బీమా ప్రీమియంను చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. తమది రైతు ప్రభుత్వమని, మోసం చేసే ప్రభుత్వం కాదని, రైతులకు ఎగమామం పెట్టిన పంటల బీమా మొత్తాన్ని రైతులకు చెల్లించాలని నిర్ణయించినట్లు జగన్ తెలిపారు. ఈ నిర్ణయంతో 5.94 లక్షల మంది రైతులకు మేలు చేకూరనుంది.