డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
By సుభాష్ Published on 16 May 2020 10:20 AM IST![డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/05/Good-News-for-DSC-Candidates.jpg)
ఏపీలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. అతి తక్కువ కాలంలోనే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తనదైన ముద్ర వేసుకకుంటున్నారు జగన్. అభివృద్ధే ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మేలు జరిగేలా పథకాలను, నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇక తాజాగా 2008 డీఎస్సీ అభ్యర్థులకు శుభ వార్త వినిపించారు. డీఎస్సీ 2008లో ఎంపిక ప్రక్రియ మార్పు కారణంగా 4657 మంది ఉద్యోగాలు కోల్పోయిన వారిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఒప్పంద ఉపాధ్యాయులుగా నియమించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి కనీసం టైం స్కేల్ రూ. 21,230గా సెకండ్ గ్రేడ్ ఎస్జీటీ ఉపాధ్యాయులుగా నియమించనున్నారు.
ఎవరైతే పదవీ విరమణ వయసు వరకూ పని చేసేందుకు ఆసక్తి చూపుతారో వారి నుంచి అంగీకార పత్రాలను తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులను జగన్ సర్కార్ ఆదేశించింది.
కాగా, డీఎస్సీ 2008లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులకు మొదట డీఈడీ వాళ్లకే అవకాశం కల్పించారు. దీనిపై బీఈడీ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా, డీఈడీ వాళ్లకు 30 శాతం పోస్టులే కేటాయించారు. దీంతో ముందుగా పోస్టులు వచ్చిన డీఈడీ అభ్యర్థులు నిరాశే కలిగింది. వారి పోస్టులు కోల్పోవాల్సి వచ్చింది. ఈ అభ్యర్థుల వినతి మేరకు గత ప్రభుత్వం ఎమ్మెల్సీలతో కమిటీ వేసింది. కనీస వేతనంతో వీరికి పోస్టింగ్‌లు ఇవ్వాలని కమిటీ సిఫార్స్ చేసింది. దీనికి తాజాగా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపడంతో వారికి ఊరట లభించింది.
మొత్తం 4,657 అభ్యర్థులు
కాగా, డీఎస్సీ 2008కి సంబంధించిన అభ్యర్థులు 4,657 మంది ఉన్నట్లు అధికారులు తేల్చారు. వీరిలో కొందరు ఇప్పటికే ఇతరాత్ర ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అయితే వీరికి పదవీ విరరమణ వరకూ కనీసం టైమ్ స్కేల్ ఇస్తూ ఉద్యోగాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.