ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు షాకిచ్చిన ఏపీ ఆర్టీసీ.. ఆరువేల మందిపై వేటు

By సుభాష్  Published on  15 May 2020 9:14 AM GMT
ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు షాకిచ్చిన ఏపీ ఆర్టీసీ.. ఆరువేల మందిపై వేటు

ఏపీ ఆర్టీసీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు షాకిచ్చింది. నేటి నుంచి విధులకు హాజరు కావొద్దని ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి డిపో మేనేజర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ షాకింగ్‌ ప్రకటనతో ఒకేసారి ఆరువేల మందికిపైగా ఉద్యోగులపై వేటు పడింది. ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 6వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు అధికారుల ద్వారా సమాచారం.

కాగా, ఇప్పటి వరకూ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఏప్రిల్‌ నెలకు సంబంధించి వేతనాలు అందలేదు. అయితే ఆర్టీసీ యాజమాన్యం తీరుపై కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. బాలకాశి, కార్యదర్శి నూర్‌ మహ్మద్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఉద్యోగాల్లోంచి తొలగిస్తే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వారిని ఉద్యోగాల్లోంచి తొలగించడం పట్ల జీవితాలు రోడ్డున పడినట్లయివుతుందని అన్నారు. వెంటనే ఆర్టీసీ చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story
Share it