ధనత్రయోదశి వేళ బంగారం కొనుగోళ్లు పడిపోయాయి.. ఎందుకు?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2019 1:47 PM IST
ధనత్రయోదశి వేళ బంగారం కొనుగోళ్లు పడిపోయాయి.. ఎందుకు?!

ఢిల్లీ: ఆర్థిక మాంద్యం ప్రభావం మెల్ల మెల్లగా అన్నింటిపైనా కన్నిస్తుంది. ఈ మందగమనం మహిళలకు ఎంతో ప్రితికరమైన రోజైనా..ధనత్రయోదశిపైన కూడా దీని ప్రభావం భారీగానే పడింది. దీంతో దీపావళికి ముందు 'ధన్‌ తేరస్‌' నాడు బంగారం కోంటే కలిసోస్తుందన్న సెంటిమెంట్‌ను కొనుగోలుదారులు ఈ ఏడాది పూర్తిగా పక్కనపెట్టారు.

కారణాలు:

ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఏర్పడిన కారణంగా ధరలు భారీగా పెరగాయి. దీంతో కొనుగోలు దారులు బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపించలేదు. దీంతో పసిడి విక్రయాలు ఏకంగా 40 శాతం వరకు పడిపోయాయి. దీంతో ఈ ఏడాది ఏకంగా 64 శాతం తగ్గి 6 టన్నుల పసిడి కొనుగోలు జరిగింది. పసిడి కొనుగోలుదారులు ఆచితూచి వ్యవహరించటమే దీనికి కారణం.

బంగారం ధరలు:

గత ఏడాది 17 టన్నులున్న పసిడి నాణేలు, బిస్కెట్ల విక్రయాలు జరిగాయి. అయితే 2018 ధన్‌ తేరస్‌ నాడు రూ.32,240 పలికిన పది గ్రాముల బంగారం.. ఈ ఏడాది ఢిల్లీ మార్కెట్లో రూ.220 పెరిగి..రూ.39,240కి చేరింది.

గతేడాది ఇదే కాలంలో వెండి ధర కూడా రూ.38,650 నుంచి రూ. 45,600 కు చేరింది. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో రూ.45,000 నుంచి రూ.48,600 మధ్య ట్రేడైంది.

పదేళ్లలో అత్యధిక తగ్గుదల:

గత పదేళ్లలో ధనత్రయోదశి అమ్మకాలు ఎన్నడూ బులియన్‌ మార్కెట్‌ను ఈ స్థాయిలో నిరాశ పరచలేదని పరిశ్రమ వర్గాలు చెటుతున్నాయి. కానీ.. కార్పొరేట్‌ నగల దుకాణాలు మాత్రం అమ్మకాలు ఫరవాలేదని చెబుతున్నాయి. అయితే వ్యాపారులను ధనత్రయోదశి నిరాశ పెట్టడంతో.. వచ్చే పెళ్లిళ్ల సీజన్ పైనే ఆశలు పెట్టుకున్నారు.

Next Story