తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా కోఠిలోని గోకుల్‌చాట్‌ యజమానికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అందులో పనిచేస్తున్న 20 మంది సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. వెంటనే గోకుల్‌చాట్‌ను మూసివేయించారు. గత రెండు రోజులుగా అక్కడకు వచ్చిన వారి వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. గోకుల్‌ చాట్‌కు నిత్యం వందల సంఖ్యలో చాట్‌ ఆరగించడానికి వస్తుంటారు. ఈ విషయం తెలిసిన వినియోగదారుల్లో ప్రస్తుతం ఆందోళన మొదలైంది.

తెలంగాణలో సోమవారం ఒక్క రోజే 219 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 5193 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 187 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో నమోదు అవుతున్న కేసుల్లో అత్యధికం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదు అవుతుండడం గమనార్హం

తోట‌ వంశీ కుమార్‌

Next Story