కరోనాతో హోంగార్డు మృతి..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jun 2020 7:21 AM GMT
కరోనాతో హోంగార్డు మృతి..

పోలీసులను కూడా కరోనా వదలడం లేదు. పెద్ద ఎత్తున ఈ మహమ్మారి బారీన పడుతున్నారు. ఈ మహమ్మారి కారణంగా నేడు డబీర్‌పుర కానిస్టేబుల్‌ కూడా మృతి చెందాడు. డబీర్‌పుర పోలీస్ స్టేషన్ లో హోంగార్డు పని చేస్తున్న అశోక్‌ కుమార్‌.. నాలుగు రోజుల క్రితం తన ఇంట్లోని బాత్రూంలో కాలుజారీ పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా వచ్చింది. దీంతో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో నేడు మృతి చెందాడు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా రెండు వందలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసులు నమోదు కావడం గమనార్హం. కాగా.. తెలంగాణలో సోమవారం ఒక్కరోజే 219 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు 5193 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 187 మంది మృత్యువాత పడ్డారు.

Next Story