వైసీపీలో చేరనున్న గోకరాజు గంగరాజు..!
By అంజి Published on 9 Dec 2019 10:29 AM ISTఅమరావతి: రాష్ట్ర బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు వైసీపీలో చేరెందుకు సిద్ధమయ్యారు. గోకరాజు గంగరాజుతో పాటు కుటుంబ సభ్యులు కూడా వైసీపీలో చేరనున్నారని సమాచారం. గోకరాజు గంగరాజు, కొడుకు రామరాజు, తమ్ముడు నరసింహరాజు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇవాళ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో మధ్యాహ్నం 3.05 గంటలకు గోకరాజు కుటుంబం వైసీపీలో చేరనుంది. గోకరాజు కుటుంబాన్ని సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో గోకరాజు గంగరాజు బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఏపీలో అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీకి.. ఇప్పుడు గంగరాజు వైసీపీలో చేరుతుండడంతో రాష్ట్ర బీజేపీ నాయకులకు షాక్ తగిలినట్లైంది. కేంద్ర బీజేపీ నేతలతో గోకరాజు గంగరాజుకు సత్సబంధాలు ఉన్నాయి. అమిత్‌షాకు అత్యంత సన్నిహితుడుగా గోకరాజు ఉన్నారు.