ఏపీ రంగుల జీవో సస్పెండ్

By సుభాష్  Published on  5 May 2020 11:53 AM GMT
ఏపీ రంగుల జీవో సస్పెండ్

ఏపీలోని గ్రామ సచివాలయాలకు వేసిన రంగుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సచివాలయాలకు వైసీపీ రంగులను పోలి ఉండే రంగులను వేస్తున్నారని హైకోర్టులో పిల్‌ దాఖలైంది. అయితే ఈ పిల్‌పై విచారించిన హైకోర్టు.. రంగులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పుడు పంచాయతీ కార్యాలయాలకు టెర్రా కోట రంగు, వైట్‌, బ్లూ, గ్రీన్‌ వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో 623 ద్వారా ఆదేశాలు ఇచ్చారు. కాగా, ఈ ఆదేశాల్లో వైసీపీ రంగులే ఉంన్నాయని, టెర్రా కోట రంగు కూడా వైసీపీ జెండాలో ఉన్నాయని న్యాయవాది సోమయాజులు కోర్టుకు వివరించారు.

దీంతో జీవో నంబర్‌ 623ను తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది ధర్మాసనం. ఏ లెక్కన ఆ రంగులను వేయాలని ఆదేశాలు ఇచ్చారో కౌంటర్‌ దాఖలు చేయాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. సరైన వివరణ ఇవ్వనట్లయితే కోర్టు ధిక్కణ కింద చర్యలు ఉంటాయని కోర్టు పేర్కొంది. ఇక ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది.

Next Story