జార్జిరెడ్డే వ‌చ్చి న‌టించాడా అనేంత అద్భుతంగా న‌టించాడు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Nov 2019 11:59 AM GMT
జార్జిరెడ్డే వ‌చ్చి న‌టించాడా అనేంత అద్భుతంగా న‌టించాడు..!

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జార్జిరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం జార్జిరెడ్డి. వంగవీటి ఫేం సందీప్ మాధవ్ (సాండి) లీడ్ రోల్ లో నటించిన మూవీని ‘దళం’ మూవీ ఫేం జీవన్ రెడ్డి తెర‌కెక్కించారు. మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి, సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా గురించి మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా స్పందించారు.

జార్జిరెడ్డి గురించి నాగ‌బాబు మాట‌ల్లో... ఈ మ‌ధ్య నేను రోడ్డు మీద‌ వెళుతుంటే జార్జిరెడ్డి పోస్ట‌ర్ చూసాను. జార్జిరెడ్డి అనే వ్య‌క్తి ఉస్మానియా యూనివ‌ర్శిటీలో స్టూడెంట్. ఆయ‌న గురించి ఓ ప‌ద్దెనిమిది, ఇర‌వై ఏళ్లుగా విన్నాను. జార్జిరెడ్డి క్యారెక్ట‌ర్ మా క‌ళ్యాణ్ బాబుతో అయినా.. నెక్ట్స్ జ‌న‌రేష‌న్‌లో మా అబ్బాయితో అయినా చేద్దామ‌ని ఆలోచించాను కానీ ఈ లోపునే సినిమా వ‌చ్చేసింది.

ఆయ‌న తెర‌కెక్కించిన 'ద‌ళం' సినిమాలో నేను గెస్ట్ గా చేసాను. జార్జిరెడ్డి పోస్ట‌ర్ చూసిన త‌ర్వాత ట్రైల‌ర్ చూసాను. చాలా బాగా న‌చ్చింది. అయితే.. ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత అనిపించింది ఏంటంటే... ఆ క్యారెక్ట‌ర్ కి బాగా పాపుల‌ర్ అయిన వ్య‌క్తి చేస్తే అంత బాగుండ‌దు. జార్జిరెడ్డి క్యారెక్టర్ చేసిన ఆ.. అబ్బాయి సాండీ త‌క్కువుగా తెలుసు. జార్జిరెడ్డి క్యారెక్ట‌ర్ ని జార్జిరెడ్డే చేసాడా అనేలాగా.. అంత యాప్ట్ గా సూట‌య్యాడు. అద్భుతంగా చేశాడు.

ట్రైల‌ర్ కూడా అంత అద్భుతంగా ఉంది. ఇవ‌న్నీ ప‌క్క‌న‌పెడితే... మేము ఎందుకు జార్జిరెడ్డిని ఇష్ట‌ప‌డుతున్నాం.? జార్జిరెడ్డి అంటే ఎందుకు మాకు అంత ఇష్టం..? అంటే... జార్జిరెడ్డి ఒక లెజండ‌రీ స్టూడెంట్. రియ‌ల్ లెజెండ్. ఎంత గొప్పోడు అంటే... అత‌ను ఫిజిక్స్ లో, మేథ‌మెటిక్స్ లో గోల్డ్ మెడ‌లిస్ట్. ఆ రోజుల్లోనే ఇస్రోలో జాబ్ వ‌స్తే... దానిని వ‌దిలేసి వ‌చ్చిన వ్య‌క్తి. ఈ రోజు వింటున్న‌టువంటి పిడిఎస్యు అనే సంస్థ‌ను స్ధాపించాడు.

ఆ రోజుల్లో ఉస్మానియా యూనివ‌ర్శిటీలో ఎన్నో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతుంటే... ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దిన వ్య‌క్తి. త‌న క్లాస్ మేట్స్ కి పాఠాలు చెప్పేవాడు. అంత ఇంటిలిజెంట్. అయితే... నాలెడ్జ్ వ‌ర‌కే ప‌రిమితం కాలేదు హి ఈజ్ రియ‌ల్ హీరో. 20, 30 మందిని ఒక్క‌డే కొట్ట‌గ‌ల‌డు. రియ‌ల్ లైఫ్ బాక్స‌ర్. అనేక విద్య‌ల్లో ప్రావిణ్య‌త ఉంది.

అంటే ఒక వ్య‌క్తికి ఇన్ని ర‌కాల విద్య‌లు వ‌చ్చా..? అనిపిస్తుంటుంది. అత‌ను అనుకుంటే.. అర‌ణ్యంలోకి వెళ్లినా బ‌త‌క‌గ‌ల సత్తా ఉన్న‌టువంటి వ్య‌క్తి కానీ... ప్ర‌జ‌ల్లో ఉండి ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నుకున్నాడు. ఉస్మానియా యూనివ‌ర్శిటీలోనే ఉండి స్టూడెంట్స్ ప్రాబ్ల‌మ్స్ తో పాటు ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించిన లెజెండ్. 25 కత్తిపోట్లతో కూడా ప్రాణాలు దక్కించుకుని, మళ్లీ సమస్యలపై పోరాటం చేసిన జార్జిరెడ్డిని, కొన్ని శక్తులు మట్టుబెట్టాయి.

Next Story