భారీగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..

By అంజి
Published on : 1 March 2020 1:11 PM IST

భారీగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..

హైదరాబాద్‌: వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరలు ఒక్కసారిగా తగ్గాయి. అయితే అన్ని గ్యాస్‌ సిలిండర్లకు కాదండీ.. మార్చి 1 నుంచి సబ్సిడీ కాని గ్యాస్‌ సిలిండర్లకు తగ్గిన ధరలు వర్తించనున్నాయి. ఈ మాదిరిగా గత సంవత్సరం ఆగస్టులో గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గాయి. అయితే ఇక్కడ మనం సంతోషపడాల్సిన అవసరం లేదు. గడిచిన ఆరు నెలల నుంచి వరుసగా ఆరుసార్లు గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచడం గమనార్హం. ప్రధానంగా మెట్రో నగరాల్లో ఈ ధరలు వర్తించనున్నాయి.

ఢిల్లీ, ముంబైలో 14.2 కిలోల బరువు గల సిలిండర్‌ ధరను రూ.53లకు తగ్గించారు. గత సంవత్సరం ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 50 శాతం గ్యాస్‌ ధరలు పెరిగాయి. మార్చి 1 2020 నుంచి మెట్రో నగరామైన ఢిల్లీలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.805గా ఉండగా, ముంబైలో రూ.776 గా ఉంది. ఫిబ్రవరి 29 వరకు ఈ ధరులు రూ.858గా ఉండేవి. ఒక్కసారిగా గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెద్ద మొత్తంలో తగ్గడంతో సిటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక గత ఆరు నెలలుగా పెరుగుతూ వచ్చిన గృహ అవసరాలకు వాడే సిలిండర్‌ ధర మాత్రం ప్రస్తుతానికి యధాతధంగానే ఉంది. అక్టోబర్‌లో ఎల్పీజీ సిలిండర్‌ ధ రూ.15 వరకు పెరిగింది. సెప్టెంబర్‌లో రూ. 15.5 వరకు, నవంబర్‌లో ఏకంగా రూ. 75, డిసెంబర్‌లో రూ.14, జనవరిలో రూ. 19 వరకు పెరిగి నిలకడగా ఉంది. ఇక వాణిజ్య అవసరాల కోసం వినియోగించుకునే కమర్షియల్‌ సిలిండర్‌ ధర పెంపుతో ట్రేడర్లకు ఇబ్బందులు తప్పవనే చెప్పాలి.

నగరం

ప్రస్తుత సిలిండర్‌ ధర

పాత ధర

ఢిల్లీరూ.805.5858.50
చెన్నై826881
ముంబాయి776.5829.50
కోల్‌కతా839.5896

Next Story