తెలంగాణలో యువతిపై గ్యాంగ్‌రేప్‌.. ఆరుగురు మైనర్లే..!

By అంజి  Published on  9 Feb 2020 9:59 AM IST
తెలంగాణలో యువతిపై గ్యాంగ్‌రేప్‌.. ఆరుగురు మైనర్లే..!

తెలంగాణలో దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన మానవమృగాల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. మహిళలు, చిన్నారులపై కనీస కనికరం లేకుండా కామాంధులు దారుణాలకు ఒడిగడుతున్నారు. మహబూబాబాద్‌ రూరల్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. యువతిపై మైనర్లు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆమనగల్‌ శివారులోని ఓ తండాకు చెందిన బాలుడు హైదరాబాద్‌లోని క్యాటరింగ్‌ పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ బాలుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలానికి చెందిన ఓ యువతితో పరిచయమైంది. హైదరాబాద్‌లోని బంధువుల ఇంటి నుంచి ఆ యువతి తన సొంతింటికి తిరుగు ప్రయాణమైంది. గోల్కొండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో రాత్రి 7 గంటలకు మహబూబాబాద్‌ చేరుకున్న ఆమె.. సదరు బాలుడికి ఫోన్‌ చేసింది. దీంతో అక్కడికి చేరుకున్న బాలుడు.. ఆమెను తొలుత ఆటోలో తండాకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత 8.30 గంటలకు మహబూబాబాద్‌-తొర్రూర్‌ రోడ్డు పక్కన గల ఓ మామిడి తోటకు తీసుకెళ్లాడు.

యువతిపై బాలుడు బలవంతంగా అత్యచారం చేశాడు. ఆ తర్వాత తన స్నేహితులకు సమాచారం అందించాడు. తండాకు చెందిన ఇద్దరు, మహబూబాబాద్‌కు చెందిన మరో ఇద్దరు, తొర్రూర్‌కు చెందిన మరో బాలుడు.. యువతిపై గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. దీంతో తోటలోంచి యువతి అరుపులు, కేకలు వినపడటంతో అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. యువతిని వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామి సీఐ వెంకటరత్నం తెలిపారు.

మూగ బాలికపై అత్యాచారం..

ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో ఓ మూగ బాలికపై అత్యాచారం జరిగింది. మూగ బాలికకు మాయమాటలు చెప్పిన 40 ఏళ్ల వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఆల్వాల్‌లో చోటు చేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రులు కూలీ పని చేసుకోవడానికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన నిందితుడు.. బాలిక ఇంట్లోకి చొరబడి అత్యాచారం చేశాడు. నిందితుడిని స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story