గాంధీ ఆస్ప‌త్రిలో క‌రోనా క‌ల‌క‌లం..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 April 2020 6:46 AM GMT
గాంధీ ఆస్ప‌త్రిలో క‌రోనా క‌ల‌క‌లం..

క‌రోనా వైర‌స్ దేశంలో విజృంభిస్తోంది. రోజు రోజుకు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవ‌ల తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గుతుండ‌డం కాస్త ఆనందాన్ని క‌లిగించే అంశ‌మే. అయితే.. తాజాగా హైదరాబాద్ గాంధీ ఆస్ప‌త్రిలో క‌రోనా క‌ల‌క‌లం రేపింది. ఆస్ప‌త్రిలో అంబులెన్స్ డ్రైవ‌ర్ గా ప‌నిచేస్తున్న సూదగాని వినోద్‌కి కరోనా వ్యాధి సోకినట్లు అధికారులు ధృవీకరించారు. ప్ర‌స్తుతం అత‌డు అత్త‌గారి ఇల్లు అయిన బ‌య్యారంలో ఉంటున్నాడు. ఇక వినోద్ కు క‌రోనా పాజిటివ్ గా తేల‌డంతో .. అధికార‌లు అత‌డి భార్య, పిల్ల‌ల‌తో పాటు అత్త‌మామ‌ల‌ను బ‌య్యారంలో హౌజ్ క్వారంటైన్‌లో చేశారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలో 1,009 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి బారీన ప‌డి 25 మంది మ‌ర‌ణించారు. మొత్తం న‌మోదు అయిన కేసుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 374 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. ప్ర‌స్తుతం 610 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల్లో 50 శాతానికి పైగా కేసులు జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే.

Next Story