శ్రియా 'గ‌మ‌నం' ఫ‌స్ట్ లుక్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Sept 2020 1:52 PM IST
శ్రియా గ‌మ‌నం ఫ‌స్ట్ లుక్

సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా హీరోయిన్‌గా కొనసాగుతోంది శ్రియా శరణ్‌. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో సినిమాలు చేసింది. దాదాపుగా అందరూ స్టార్‌ హీరోలతో నటించింది శ్రియా. తాజాగా ఆమె నటిస్తున్న సినిమా 'గమనం'. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. శుక్రవారం శ్రియా పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు.

సుజనా రావు దర్శకత్వం వహిస్తున్న రియల్ లైఫ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో శ్రియా ప్రధాన ప్రాతలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను క్రియేటివ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ విడుదల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో చీర క‌ట్టుకొని, మెడ‌లో మంగ‌ళ‌సూత్రం మాత్ర‌మే ఉన్న ఒక అతి సాధార‌ణ గృహిణిలా క‌నిపిస్తున్నారు శ్రియ‌. ఏ విష‌యం గురించో తీవ్రంగా ఆలోచిస్తున్న‌ట్లు ఆమె ముఖంలోని భావాలు తెలియ‌జేస్తున్నాయి. మొత్తానికి ఇదివ‌ర‌కెన్న‌డూ చేయ‌ని పాత్ర‌లో శ్రియ క‌నిపించ‌నున్నార‌ని ఆమె రూపం తెలియ‌జేస్తోంది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తుండగా.. రచ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు రాస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫస్ట్‌ లుక్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.



Next Story