'పవర్ స్టార్‌‌' ‌మూవీ నుండి సాంగ్ రిలీజ్ చేసిన ఆర్జీవీ

By Medi Samrat  Published on  19 July 2020 12:29 PM GMT
పవర్ స్టార్‌‌ ‌మూవీ నుండి సాంగ్ రిలీజ్ చేసిన ఆర్జీవీ

వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ 'పవర్ స్టార్' సినిమా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌ర్మ ఆ సినిమా ప్రకటించిన అప్ప‌టి నుండి ప్ర‌జ‌ల్లో అమిత‌మైన ఆస‌క్తి నెల‌కొంది. వ‌ర్మ ఏం చూపించ‌బోతున్నాడో అంటూ సినీ, రాజకీయ వర్గాలలో ఈ సినిమాపై చర్చలు మొద‌ల‌య్యాయి.

అయితే సినిమా ప్ర‌క‌టించిన నాటి నుండి సినిమాకు సంబంధించి వరుస పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సంచలనం సృష్టించారు వ‌ర్మ‌. తాజాగా మరో అడుగు ముందుకేసి.. పవర్ స్టార్ సినిమా నుండి ఓ సాంగ్ రిలీజ్ చేశారు వర్మ. ఈ రోజు ఉద‌యం పవర్ స్టార్ మూవీ నుండి గడ్డి తింటావా? సాంగ్‌ను ఈ రోజు (జులై 19) సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ట్విట‌ర్ ద్వారా ప్రకటించిన వ‌ర్మ కొద్దిసేప‌టి క్రితం అన్నంత ప‌ని చేశాడు.

పాట‌లో న‌టించిన‌ హీరో.. తన ఫాంహౌస్‌లో త‌న గేదెలు, చెట్లను ఉద్దేశించి పాట పాడుతున్న‌ట్లుగా వ‌ర్మ రిలీజ్ చేసిన‌ వీడియో సాంగ్‌లో వుంది. సాయంత్రం 5 గంట‌ల‌కు రిలీజైన ఈ పాట గంట‌లోనే ల‌క్ష‌ల్లో వ్యూస్ సాధించి.. ట్రెండింగ్‌లో ఉంది. ఇక ఇదిలావుంటే.. ఈ మూవీ ట్రైలర్ జూలై 22 ఉదయం 11 గంటలకు, సినిమా జులై 25వ తేదీ 11 గంటలకు ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అయితే ప్ర‌పంచ చ‌రిత్ర‌లో తొలిసారిగా కేవ‌లం ట్రైల‌ర్‌ను వీక్షించ‌డానికి ఫ‌ర్ వ్యూ రూ. 25లు వ‌సూలు చేస్తున్న‌ట్లు వ‌ర్మ ప్ర‌క‌టించారు. క‌రోనా కార‌ణంగా థియేట‌ర్లు లేక.. ఓటీటీల‌ను న‌మ్ముకున్న వీక్ష‌కులు వ‌ర్మ ప‌వ‌ర్ స్టార్ ట్రైల‌ర్‌ను ఏమేరకు వీక్షిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే మ‌రి.



Next Story