కార్పెంటర్‌ నుంచి కవి దాకా సతీష్ భండోజీ పయనం..!

By సత్య ప్రియ  Published on  23 Oct 2019 10:56 AM GMT
కార్పెంటర్‌ నుంచి కవి దాకా సతీష్ భండోజీ పయనం..!

ఎన్ని సంవత్సరాలైనా కొన్ని ప్రకటనలు, పాటలు మది లోతుల్లోనే ఉంటాయి... మరిచిపోవాలన్నా అవి గుర్తొస్తూనే ఉంటాయి. కళ్ల ముందు కదలాడుతుంటాయి. అలా...ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? .కొన్ని సెకన్ల పాటే ప్రకటనలు ఉంటాయి. కొన్ని నిమిషాల పాటే పాటలు ఉంటాయి. అవి ఎప్పుడూ మనల్ని మరిచిపోనివ్వవూ. ఎందుకంటే..ఆ ప్రకటనల రూపకల్పన అలా ఉంటుంది. మనం ఇప్పుడు తెలుసుకోబోయేది ఇటువంటి స్టోరీయే.

ఆయన ప్రకటనల రూపకర్తే కాదు..ట్రేండ్‌కు తగ్గట్లు పాటలు కూడా రాస్తాడు. కార్పెంటర్ నుంచి మొదలైన ఆయన ప్రస్తానం..కవి దాకా పయనించింది..పయనిస్తూనే ఉంది. ఆయనే సతీష్ భండోజీ. ఈయనది నిజమాబాద్. సతీష్ భండోజీ గురించి అనేక విషయాలు తెలుసుకున్న న్యూస్‌ మీటర్ .. ఆ విషయాలను ముందు ఉంచుతుంది.

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా సతీష్ భండోజీది. వడ్రంగి కుటుంబంలో జన్మించాడు. చిన్నతనం నుంచి భండోజీకి రాయడం అంటే ఇష్టం. కష్టపడుతూనే తనకు ఇష్టమైన కవితలను ప్రేమించాడు. వడ్రంగి పని చేసుకుంటూనే కవితలు రాసేవాడు. అయితే..కుటుంబ సభ్యుల్లో ఆందోళన, తమకు పరిచయంలేని పనిలో భండోజీ నిమగ్నం అవుతున్నాడనే ఆవేదన.

కుటుంబ సభ్యులకు నచ్చచెబుతూనే..పరిస్థితులను ఎదిరిస్తూ ముందుకు కదిలాడు.1995లో ఆల్ ఇండియా రేడియోలో స్క్రిఫ్ట్ రచయితగా ఉద్యోగం సంపాదించాడు. అప్పటి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోనవసరం లేకుండా పోయింది.

హైదరాబాద్ వచ్చినా కార్పెంటర్ పని..

రచనలు అంటే డబ్బున్నవారికే అనే ఆలోచన తమ తల్లిదండ్రులకు ఉండేదని సతీష్ భండోజీ చెప్పారు. వారికి నచ్చజెప్పి..2007లో భార్య పిల్లలతో హైదరాబాద్ వచ్చేశారు భండోజీ. టాలీవుడ్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కుటుంబ పోషణకు డబ్బుల్లేవు, టాలీవుడ్‌లో అవకాశాల్లేవు. కుటుంబాన్ని పోషించుకోవాలి..ఎలా?. ఈ సమయంలో భండోజీని ఆదుకుంది..అతని వృత్తే. హైదరాబాద్‌లో మరోసారి కార్పెంటర్‌ అవతారమెత్తాడు భండోజీ. 2011లో ఓ టీవీ ఛానల్‌లో చేరాడు. డబ్బులు సరిపోక పోవడంతో వడ్రంగి పని మానలేదు.

Satish Bandoji1

స్క్రిప్ట్ లే ప్రాణంగా...1

బతకడానికి వడ్రంగి పని చేస్తూనే యానిమేషన్ నేర్చుకున్నారు. పప్పెంట్ అనే ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీలో చేరాడు. ఇక్కడ అక్బర్‌ - బీర్బల్ సీరియల్ కు స్క్రిప్ట్ కూడా రాశారు. గ్రావిటీ ఫిలిం అనే యాడ్ కంపెనీలో చేరిన తరువాత..ఇక అక్షరం ఆదుకోవడం మొదలు పెట్టింది. ఎన్నో తెలుగు యాడ్స్‌కు జింగల్స్ రాశారు. కపిల్ చిట్ ఫండ్స్, గోదావరి ఘీ, బంధన్ టైల్స్‌, ట్రిపుల్ ఎక్స్ డిటర్జంట్ జింగల్స్ ముఖ్యమైనవి. గోదావరి ఘీకి బెస్ట్ యాడ్ ఫిలిం రైటర్‌ అవార్డ్ వచ్చింది. ఒక యాడ్ ఫిలింలో లో చలపతి రావు, చంద్ర మోహన్ గార్లతో కలిసి నటించారు.

Satish Bandoji2

2015 నుంచి సినిమాల్లో గీత రచయితగా మొదటి అవకాశం వచ్చింది. 2016లో 'నీలంపాటి అమ్మవారు' చిత్రానికి మొదటి డైలాగ్ రచయితగా అవకాశం వచ్చింది. ' ఒక్కటే లైఫ్' అనే చిత్రానికి కధ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు సతీష్ భండోజీ సమకూర్చారు. . మరో రెండు చిత్రాలు ఇంకా విడుదల కానున్నాయి.

Satish Bandoji3

"ఎన్నో కష్టాలకోర్చి ఈ స్థితి కి వచ్చాను, మంచి చిత్ర దర్శకుడు కావాలన్నది నా కోరిక. అనుకున్న వృత్తి ని ఎంచుకొని విజయం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉంది" అంటున్నారు సతీష్ భండోజీ.

Next Story