ఏపీలో జనవరి 1 నుంచి సమగ్ర భూ సర్వే
By తోట వంశీ కుమార్ Published on 31 Aug 2020 3:16 PM ISTఆంధ్రప్రదేశ్లో జనవరి 1 నుంచి సమగ్ర భూ సర్వే చేపట్టనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియను ఆగస్టు 2023 నాటికి పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేపై సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ నీలం సాహ్నితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
అర్భన్ ప్రాంతాల్లోనూ సమగ్ర సర్వే చేపట్టాలని సూచించారు. సమగ్ర భూ సర్వే వివాదాల పరిష్కారానికి మొబైల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి.. అక్కడికక్కడే వివాదాల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. గ్రామ సభల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. సమగ్ర భూ సర్వే కోసం డ్రోన్లు, రోవర్లు, సర్వే రాళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సర్వేయర్లకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలకు సంబంధించిన ప్రజెంటేషన్ సమర్పించారు.