కలిసి తాగారు.. తాగిన మత్తులో ఏం చేశాడంటే..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Jan 2020 9:37 PM ISTఓ మిత్రుడి కోపం మరో మిత్రుడి చావు మీదకి వచ్చింది. వివరాళ్లోకెళితే.. తనఖా పెట్టిన వాహనం విడిపించలేదని మిత్రుడి ముక్కును తీవ్రంగా మరో మిత్రుడు కొరికాడు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
టూవీలర్ విషయంలో ఇద్దరు మిత్రులు తాగిన మైకంలో గొడవ పడ్డారు. రమేష్ అనే వ్యక్తి బైక్‌ను వెంకట్ రెడ్డి అనే వ్యక్తి తనఖా పెట్టాడు. ఈ నేపథ్యంలో పూటుగా తాగిన అనంతరం బైక్ విషయమై ఇరువురు మిత్రులు గొడవపడ్డారు. గొడవలో వెంకట్ రెడ్డి ముక్కును రమేష్ కొరికాడు. ఈ ఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్కంపేటలో చోటు చేసుకుంది. ఈ విషయమై వెంకట్‌రెడ్డి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఛేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story