మహిళలకు శుభవార్త.. చీర కొంటె కరోనా కిట్లు ఉచితం
By తోట వంశీ కుమార్ Published on 19 Jun 2020 4:20 PM IST
కరోనా కారణంగా దేశ వ్యాప్తలాక్‌డౌన్ విధించడంతో వ్యాపార లావాదేవీలు భారీగా కుదేలయ్యాయి. కాగా.. లాన్‌డౌన్ సడలింపులతో ఇప్పుడిప్పుడే వ్యాపారాలు ఊపందుకుంటున్నాయి. కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం సరికొత్త ఆఫర్లు తీసుకొస్తున్నారు. సూరత్ వస్త్ర వ్యాపారులు తీసుకొచ్చిన ఆఫర్ అందరినీ ఆకట్టుకుంది.
మహిళలు చీర కొంటె చీరతో పాటు కరోనా కిట్లు ఉచితంగా అందిస్తున్నారు. ఆ కిట్ లో శానిటైజర్లు, హోమియోపతి మందు బిళ్లల డబ్బా, ఆయుర్వేదం పౌడర్, మాస్క్‌లు ఉంటాయి. చీర కొనుగోలు చేసిన వారికి ఈ కరోనా కిట్ బాక్స్ ఫ్రీగా ఇస్తున్నారు. దీని వల్ల మహిళలు కరోనా బారీన పడకుండా ఉండారని అంటున్నారు.
“కరోనా కవచం” పేరుతో ఈ ఆఫర్‌ను మొదట సూరత్ వ్యాపారులు ప్రకటించారు. ఈ విషయం తెలిసిన వెంటనే యూపీ, రాజస్థాన్, బీహార్ నుంచి భారీగా ఆర్డర్లు వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. రూ.500 నుంచి రూ.5000 వరకు ఖరీదు ఉండే చీరలకు కరోనా కవచం అందజేస్తున్నారు. చీరతో పాటు కరోనా కిట్లు ఫ్రీగా వస్తుండడంఓ మహిళలు కూడా కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.