జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో బుధవారం కాల్పులతో దద్దరిల్లిపోయింది. ఉగ్రవాదులు-భద్రతా బలగాల మధ్య హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. జైనపోరా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది.

దీంతో ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో వారి కాల్పులను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం కాగా, ఘటన స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. హతమైన ఉగ్రవాదుల్లో ఒకరు సీనియర్‌ కమాండర్‌గా అధికారులు గుర్తించారు. ఇంకా ఉగ్రవాదులు నక్కి ఉన్నారేమోనన్న అనుమానంతో భారీ ఎత్తున సైన్యం రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపడుతున్నాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.