వ్యవసాయ బావిలో నాలుగు మృతదేహాలు.. హత్యా? ఆత్మహత్య?

By అంజి  Published on  21 March 2020 3:11 PM GMT
వ్యవసాయ బావిలో నాలుగు మృతదేహాలు.. హత్యా? ఆత్మహత్య?

ముఖ్యాంశాలు

  • చిత్తూరు జిల్లా పుంగనూరులో విషాదం
  • ఓ వ్యవసాయ బావిలో నాలుగు మృతదేహాలు
  • ముగ్గురు పిల్లలు, మహిళ మృతదేహాలుగా గుర్తింపు
  • హత్యా? ఆత్మహత్య? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు

చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యవసాయ బావిలో నాలుగు మృతదేహాలు కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. పుంగనూరు మండలం ప్రసన్నయ్యగారిపల్లె సమీపంలోని ఓ బావిలో నలుగురి మృతదేహాలు వెలుగు చూశాయి. మృతదేహాలను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలోంచి మృతదేహాలను బయటకు తీశారు. ఓ మృతదేహం మహిళది కాగా.. మరో మూడు మృతదేహాలు 10 ఏళ్ల లోపు చిన్నారులవిగా గుర్తించారు. అయితే మృతులు స్థానికేతరులు కాదని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యా? ఆత్మహత్య? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే బావి నుంచి బయటకు తీసిన మృతదేహాలు ఉబ్బిపోయి ఉన్నాయి. మృతదేహాలను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

Also Read: ఎమ్మెల్యే కుమార్తె ఉరి వేసుకుని ఆత్మహత్య

Next Story
Share it