కరోనాతో పాక్ మాజీ క్రికెటర్ మృతి
By తోట వంశీ కుమార్ Published on 14 April 2020 7:11 AM GMTకరోనా వైరస్(కొవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ మృతి చెందాడు. ఇటీవల కరోనా లక్షణాలతో పెషావర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ.. మంగళవారం మృతి చెందారు. ఆయన వయసు 50 సంవత్సరాలు. కరోనాతో మృతి చెందిన తొలి క్రికెటర్ ఇతనే.
పాకిస్థాన్ జాతీయ జట్టులో ఎంపిక కానప్పటికి.. ఫస్టుక్లాస్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. 1988 నుంచి 1994 వరకు ఫస్టుక్లాస్ క్రికెట్ ఆడాడు. 15 మ్యాచుల్లో ఫెషావర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి 616 పరుగులు చేశాడు. 1990 నుంచి 1992 వరకు లిస్టు -ఏ క్రికెట్‌లో 6 వన్డేల్లో 96 పరుగులు చేశాడు. 1994లో ఆటకు వీడ్కోలు పలికి కోచ్‌గా మారాడు. 2000 మధ్యలో పెషావర్ సీనియర్, అండర్-19 జట్లకు కోచ్‌గా పనిచేశాడు.
Next Story