మీ మాటలు వింటాం.. మీరు మా మాటలు వినండి మోదీజీ..

By అంజి  Published on  3 April 2020 9:01 AM GMT
మీ మాటలు వింటాం.. మీరు మా మాటలు వినండి మోదీజీ..

ఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన వీడియో సందేశంపై జాతీయ కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పించింది. ప్రజలు మీ మాటలు వినడమే కాదు.. మీరు ప్రజల మాటలు వినాలంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఎన్నో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం అన్నారు.



'ప్రియమైన ప్రధాని నరేంద్ర మోదీ.. మేము మీ మాటలను వింటాము, ఏప్రిల్‌ 5న దీపాలు వెలిగిస్తాం.. అయితే దానికి ప్రతిగా మా మాటలను, ఎపిడెమియాలజిస్టులు, ఆర్థిక వేత్తలు చెప్పే మాటలను వినండి. ప్రతి ఉద్యోగి, వ్యాపారి, రోజూ వారీ కూలీ ఊహించారు. మీరు ఇచ్చిన సందేశం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సింబాలిజం ఎంత ముఖ్యమో.. దేశం తిరిగి కోలుకోవడానికి తగిన చర్యలు కూడా అంతే ముఖ్యమని' ట్విటర్‌ వేదికగా చిదంబరం విమర్శలు చేశారు.



అంతకుముందు మరో కాంగ్రెస్‌ నేత, తిరువనంతపురం పార్లమెంట్‌ సభ్యుడు శశిథరూర్‌ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి వీడియో సందేశంపై విమర్శలు చేశారు.



దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశం ఇచ్చారు. ఏప్రిల్‌ 5న దేశ ప్రజలంతా జాగరణ చేయాలని పిలుపునిచ్చారు. రాత్రి 9 గంటలకు దేశ ప్రజలంతా తొమ్మిది నిమిషాల పాటు జ్యోతులు వెలిగించాలన్నారు. ఇళ్లలోని విద్యుత్‌ దీపాలు బంద్‌ చేసి బాల్కానీలోకి రావాలని ప్రధాని మోదీ అన్నారు.

Next Story