సీఎం జగన్ కేసులపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సంచలన వ్యాఖ్యలు..!
By Newsmeter.Network Published on 31 Dec 2019 8:10 AM ISTఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ప్రస్తుతం ఉన్న కేసులపై సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రతీ వారం వారం సీబీఐ కోర్టుకు హాజరైన సంగతి తెలిసిందే. కానీ, ముఖ్యమంత్రి అయ్యాక ఏదో ఒక మీటింగ్, కార్యక్రమం పేరుతో కోర్టుకు హాజరు కాకుండా జగన్ తప్పించుకుంటున్నారంటూ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విస్తృత స్తాయిలో ప్రచారం చేస్తోంది.
సీబీఐ అధికారులు కోర్టుకు కచ్చితంగా రావాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసినా జగన్ మాత్రం సమావేశాలు, చర్చలను కారణాలుగా చూపుతూ హాజరు కావడం లేదంటూ టీడీపీ ప్రధానంగా ఆరోపిస్తోంది. జగన్ వ్యవహరిస్తున్న తీరుతో ఆయన బెయిల్ కూడా రద్దైపోతుందన్నది టీడీపీ వాదన. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో లక్ష్మీ నారాయణ జగన్ కేసులపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
అవన్నీ స్పెక్యులేషన్స్ అని, ప్రతి జ్యుడిషియల్ నిర్ణయాన్ని దాని సంబంధికులు పై కోర్టుకు వెళ్లి దానికి సంబంధించిన ఆర్డర్స్ తీసుకురావొచ్చని పేర్కొన్నారు. మన దేశంలో ఉన్న జ్యుడిషియల్ సిస్టమ్ ప్రకారం ఒక కోర్టులో ఇచ్చిన నిర్ణయాన్ని పై కోర్టులకు తీసుకెళ్లే అర్హత ప్రతి ఒక్కరికి ఉందన్నారు. కనుక ప్రచారాలకు సంబంధించిన విషయాలను వదిలేసి సిస్టమ్‌లో భాగంగా ఎలా ముందుకు వెళ్లాలి..? అన్నది మాట్లాడుకుంటే బాగుంటుందన్నారు.
ప్రస్తుతం ఉన్న సమాజంలోని ప్రజలకు ఎక్కువ శాతం మందికి లీగల్ ఇష్యూస్ తెలియవు. కనుక వారు స్పెక్యులేట్ చేసిన దానిని వెంటనే నమ్మేస్తారు. లోకల్ కోర్టులో జగన్ ప్రతి వారం కోర్టుకు హాజరు కావాల్సిందేనంటూ సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో జగన్ తరుపు లాయర్ హైకోర్టును ఆశ్రయించారని, హైకోర్టు కూడా ఇంకా జడ్జీమెంట్‌మెంట్ ఇవ్వలేదు. ఈ లోపల సీబీఐ చెప్పిన్టటు జగన్ కోర్టుకు హాజరు కాకుంటే ఆటోమేటిక్‌గా బెయిల్ రద్దైపోతుందని వాదన చేస్తున్న టీడీపీ శ్రేణుల విమర్శలపై జేడీ లక్ష్మీ నారాయణ స్పందించారు.
నిజానికి హైకోర్టు స్టే ఇచ్చిందా..? లేదా..? అన్నది నాకు తెలియదు. అక్కడ ఎన్‌క్వైరీ జరుగుతుండగా, ఇక్కడ కోర్టుకు ఆప్సెంట్ అవ్వొచ్చా..? గవర్నమెంట్ పరంగా రీజన్స్ చెప్పి ఆప్సెంట్ అవ్వొచ్చా..? అన్నది ఇట్ ఈజ్ ఆన్సరబుల్ టు కోర్ట్. ఫైనల్‌గా కోర్టు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. మనం ఇచ్చే సమాధానం కోర్టుకు యాసెప్టబుల్‌గా ఉంటే కోర్టు ఒప్పుకుంటుంది. మనం ఇచ్చే సమాధానం యాసెప్ట్‌బుల్‌గా లేకుంటే కోర్టు అంగీకరించదు. అటువంటప్పుడు బెయిల్ రద్దవుతుంది.
ఒకవేళ కేంద్రంతో మంచి సంబంధాలు నెరిపినా కేసులు కొట్టించేస్తారు..? తప్పించేస్తారు..? అనడం భ్రమపడినట్లే అవుతుంది. అదంతా అవాస్తవం కూడా. అందుకనే ఈ లీగల్ నాలెడ్జ్‌ను టెక్ట్స్ బుక్స్‌లో కూడా పెట్టాలి. అరెస్ట్ అన్నది ఏ కండీషన్‌లో జరుగుతుంది..? బెయిలబుల్ అఫెన్స్ అంటే ఏమిటి..? నాన్‌బెయిలబుల్ అంటే ఏమిటి..? ఇలా మినిమమ్ నాలెడ్స్‌ను మనం ప్రజలకు ఇవ్వగలగాలి అంటూ లక్ష్మీ నారాయణ తన అభిప్రాయాన్ని చెప్పారు.