మ్యాచ్ మ‌ధ్య‌లో పిడుగుపాటు.. ఆట‌గాడు మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Sept 2020 12:59 PM IST
మ్యాచ్ మ‌ధ్య‌లో పిడుగుపాటు.. ఆట‌గాడు మృతి

మ్యాచ్ మ‌ధ్య‌లో పిడుగుపాటు ఓ యువ ఆటగాడి ప్రాణాలు తీసింది. ఈ విషాద ఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలో జరిగింది. వివ‌రాళ్లోకెళ్తే.. జార్ఖండ్‌ రాష్ట్రం గుమ్లా జిల్లాలోని ఉరుబార్డి గ్రామంలో.. నెమాన్‌ కుజుర్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా మ్యాచ్‌ నిర్వహించారు.

అయితే.. మ్యాచ్‌ జరుగుతోన్న సమయంలోనే వర్షం మొదలైంది. ఇంతలో పెద్ద శబ్దంతో పిడుగు పడింది. ఈ ఘటనలో యువ పుట్‌బాల‌ర్‌ పరాస్‌ పన్నా అక్క‌డికక్క‌డే కూలిపోయాడు. ఈ ఘ‌ట‌న‌లో పరాస్‌ పన్నాతో పాటు మరో నలుగురు కూడా గాయపడ్డారు. హుటాహుటిన‌ ‌వారిని గుమ్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే పరాస్‌ పన్నా మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.

ఇక‌ ఈ ఘటన 17వ తేదీ నాడు జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది. స‌మాచారం అందిన వెంట‌నే గ్రామాన్ని సందర్శించిన పోలీసులు.. కరోనా వేళ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా మ్యాచ్‌ నిర్వహించడంపై ఆరా తీశారు. ఇదిలావుంటే.. నేష‌న‌ల్ క్రైం బ్యూరో రికార్డుల ప్ర‌కారం జార్ఖండ్‌ రాష్ట్రంలో పిడుగుపాటుకు ఒక్క 2019 వ సంవ‌త్స‌రంలోనే 334 మంది బ‌ల‌య్యారు.

Next Story