గుంటూరులో కలకలం.. కలుషిత ఆహారం తిని 22మందికి అస్వస్థత
By తోట వంశీ కుమార్ Published on 4 Jun 2020 10:02 AM GMTలాక్‌డౌన్ 5.0లో చాలా వాటికి సడలింపులు ఇచ్చింది కేంద్రప్రభుత్వం. దీంతో గత రెండు నెలలుగా మూతబడిన షాపులు, దుకాణాలు, హోటల్స్ మెళ్లిగా తెరచుకుంటున్నాయి. తాజాగా గుంటూర్ జిల్లాలో ఈ రోజు ఉదయం కలకలం రేగింది. కలుషిత ఆహారం తిని 22 మంది అస్వస్థత గురయ్యారు.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాలోని కొల్లిపర మండలం తూములూరులోని ఓ హోటల్‌లో ఈ ఉదయం 50 మంది టిఫిన్ తిన్నారు. టిఫిన్ తిన్న వారిలో 22 మంది అస్వస్థతకు గురయ్యారు. వారందరూ వాంతులు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించారు. అందులో కొందరికి కళ్లు తిరిగాయని అన్నారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. కలుషిత ఆహారం తినడం వల్లే వారు అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story