నిర్భయ తల్లికి కీలక సలహా ఇచ్చిన మహిళా న్యాయవాది

By సుభాష్  Published on  18 Jan 2020 3:14 AM GMT
నిర్భయ తల్లికి కీలక సలహా ఇచ్చిన మహిళా న్యాయవాది

నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష వేయనున్నారు. ఈ నేపథ్యంలో దోషులు క్షమాభిక్ష పిటిషన్‌ దరఖాస్తు చేసుకోగా, అందుకు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. కాగా, నిర్భయ తల్లికి ఓ సీనియర్‌ మహిళా న్యాయవాది ఇందిరా జైసింగ్‌ కీలక సలహా ఇచ్చారు. ఉరిశిక్ష పడే నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించకుండా తల్లిగా క్షమించాలని నిర్భయ తల్లిని కోరారు. నిర్భయ అత్యాచారం తర్వాత ఓ తల్లి పడే బాధ ఎలాంటిదో నాకు తెలుసని.. 1991లో రాజీవ్‌ గాంధీ హత్య కేసులో దోషి అయిన నళినికి ఉరిశిక్ష విధించగా, సోనియాగాంధీ క్షమించి, ఉరి శిక్ష వేయవద్దని కోరారని గుర్తు చేస్తూ, సోనియా గాంధీని ఆదర్శంగా తీసుకుని దోషులను క్షమించి ఉరివేయకుండా చూడాలని సూచించారు. ఆ మహిళా న్యాయవాది ఇచ్చిన సలహాకు నిర్భయ తల్లి అంగీకరించలేదు. తన కుమార్తెపై దారుణానికి పాల్పడిన నలుగురు దోషులను ఉరిశిక్ష విధించే వరకు తనకు సంతృప్తి ఉండదని నిర్భయ తల్లి తెలిపింది.

నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురిని ఇప్పటికే తీహార్‌ జైలులోని ఉరివేసే 3వ నెంబర్‌ జైలుకు తరలించారు. నలుగురు దోషులైన అక్షయ్‌ కుమార్‌, పవన్‌ గుప్త, ముఖేష్‌సింగ్‌, వినయ్‌ లను మొదటిసారిగా ఉరిశిక్ష జరిగే జైలు నంబర్‌ 3కు తరలించారు. వీరికి 22న ఉరిశిక్ష వేయాల్సిఉండగా, దోషి ముఖేష్‌ సింగ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ కారణంగా అది వాయిదా పడింది. దీంతో రాష్ట్రపతి ఆ పిటిషన్‌ను తిరస్కరించడంతో ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 6 గంటలకు నలుగురికి ఉరిశిక్ష వేయాలని తాజాగా కోర్టు వెల్లడించింది. ఈ నలుగురిని కూడా వేర్వేను సెల్స్‌ లో ఉంచి సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఇక ఆసియాలోనే అతి పెద్ద జైలు అయిన తీహార్‌ జైలులో ఈ నలుగురిని ఉరి వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్‌ సింగ్‌ పెద్దకున్న క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించిన విషయం తెలిసిందే.

Next Story