కరోనాతో మాజీ ఎలక్షన్ కమిషనర్ మృతి
By సుభాష్ Published on 16 July 2020 11:19 AM ISTదేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య తీవ్రంగా నమోదు కావడంతో మరింత భయాందోళన నెలకొంది. ఈ కరోనా మహమ్మారి సామాన్యుల నుంచి ప్రముఖల వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక మహారాష్ట్రలో అయితే తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. తాజాగా మాజీ ఐఏఎస్ అధికారిణి, మహారాష్ట్ర తొలి మహిళా ఎన్నికల కమిషనర్ నీలా సత్యనారాయణ్ కరోనాతో ప్రాణాలు విడిచారు. ఆమె వయసు 72 ఏళ్లు. కొన్ని రోజులుగా కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.
శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుండటంతో ఆమెను ముంబైలోని సెవన్ హిల్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమె రోజురోజుకు పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మరణించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
1972వ బ్యాచ్‌కు చెందిన నీలా సత్యనారాయణ్.. 2014,జూలై 5న పదవి విరమణ చేశారు. అంతకు ముందు మహారాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పని చేశారు. అంతేకాదు రాష్ట్రంలో తొలి మహిళా కమిషనర్‌గా రికార్డుల్లోకి ఎక్కారు. అలాగే రచయిఒతగా కూడా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఎన్నో పుస్తకాలు రాశారు. పలు సినిమాలకు కూడా సాహిత్యం కూడా అందించారు. ఆమె రాసిన రౌన్ అనే నవల ఆధారంగా మరాఠీలో సినిమా కూడా చిత్రీకరించారు. నీలా సత్యనారాయణ్ మొత్తం 23 పుస్తకాలను రాశారు.