హైదరాబాద్: నాచారం, హైదరాబాద్ లోనిపరిశ్రమలో గురువారం రాత్రి సుమారు గం.11.30 ని. లకు  భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాయిలర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో  ఆరుగురు కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది.  అగ్నిమాపక దళం సకాలంలో రంగంలోకి దిగి  కార్మికులను కాపాడింది. ఒక కార్మికుడు మాత్రం భవనం మీద నుంచి దూకే  ప్రయత్నంలో తీవ్రంగా  గాయపడ్డాడు.

ఈ ప్రమాదం ఎస్జీఅర్  కెమికల్స్ లిమిటెడ్   ఫ్యాక్టరీ లో జరగడంతో  చుట్టుపక్కల వారు చాలా భయపడ్డారు.  చుట్టూతాఎన్నో ఇళ్ళూ, స్కూళ్లు ఉండడంతో ఇలాంటి ప్రమాదాలు ఎంతో నష్టం కలిగిస్తాయని, కాలుష్యం వ్యాపిస్తుందని, ఈ ఫ్యాక్టరీలను వేరే ప్రదేశానికి తరలించాలని మంత్రి కేటీఆర్ ను ట్విట్టర్ లో కోరారు. దీనికి కేటీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.