హైదరాబాద్: ఎల్‌బీ నగర్‌లోని షైన్‌ అస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఐసీయులో షాట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఐసీయూలో ఉన్న ఇంక్యూబెటర్‌లో మంటలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సూర్యాపేటకు చెందిన ఐదు నెలల బాలుడు  మరణించిగా, మరో ఆరుగురికి  గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో మొత‍్తం 42మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని మెరుగైన చికిత్స కోసం వీరిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రి అద్దాలు పగలగొట్టి అగ్నిమాపక సిబ్బంది మంటలను  అదుపులోకి తెచ్చారు. ఆస్పత్రి ఎదుట బంధువుల తల్లిదండ్రుల తీవ్ర ఆందోళన నిరసన తెలిపారు.

Chinnari 1

Chinnari 2

సమయానికి ఆస్పత్రిలో అగ్నిమాపక వ్యవస్థ పని చేయలేదు.  మంటలు చెలరేగినప్పుడు సిబ్బంది గొట్టం రీల్  ఉపయోగించడానికి సిద్ధపడ్డారు.  అదీ పని చేయలేదు. పోలీసులు ఆస్పత్రిని తమ స్వాధీనం లొకి తీసుకుని విచారణ మొదలు పెట్టినట్లు సమాచారం.

Doc List

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.