విశాఖ: కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో అగ్ని ప్రమాదం

By సుభాష్  Published on  25 Aug 2020 1:37 AM GMT
విశాఖ: కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో అగ్ని ప్రమాదం

విశాఖలోని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కొమ్మాది శ్రీ చైతన్య క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలోని కంప్యూటర్‌ ల్యాబ్‌లో షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటన స్థలానికి ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు.

కాగా, క్వారంటైన్‌ కేంద్రంలో 64 మంది రోగులుండగా, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అధికారులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌ కరోనా కేర్‌ సెంటర్‌ ఘటనలో పలువురు రోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ మధ్యన కరోనా ఆస్పత్రుల్లో ఎన్నో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి సెంటర్లలో ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే విశాఖలో అగ్ని ప్రమాదాలకు సంబంధించి ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి.

ఇలా కోవిడ్‌ ఆస్పత్రుల్లో, సెంటర్లలో ఎన్నో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుని కరోనా బాధితులు మృతి చెందిన సందర్భాలున్నాయి. ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు లేక ఇలా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం విపత్కర సమయంలో కరోనాతో ఇబ్బందులు పడుతున్న రోగులకు అగ్ని ప్రమాదాల వల్ల వారి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో అధికారులు, పోలీసులు వచ్చి హడావుడి చేయడం, ఆ తర్వాత పెద్దగా పట్టించుకున్న నాథుడే కరువయ్యారని బాధితులు ఆరోపిస్తున్నారు.

Next Story