బ్రేకింగ్‌: కుప్పకూలిన భవనం.. భవనంలో 60 ప్లాట్లు!

By సుభాష్  Published on  24 Aug 2020 2:44 PM GMT
బ్రేకింగ్‌: కుప్పకూలిన భవనం.. భవనంలో 60 ప్లాట్లు!

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బహుళ అంతస్తు భవనం కుప్పకూలింది. రాయగఢ్‌ జిల్లా మహాడ్‌లో ఈ భవనం కూప్పకూలింది. ఈ భవనంలో 60 ప్లాట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 200 మంది ఈ శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ భవనం ఐదు అంత్తుల్లో ఉంది.

ఎంత మంది ప్రాణాలు కోల్పోయారన్న విషయం ఇంకా తెలియలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ భవనం కూప్పకూలినట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటన స్థలంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో చాలా మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఇప్పటికే చాలా మందిని రక్షించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ రోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఈ ఐదంతస్తుల భవనం కూలినట్లు ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారి వెల్లడించారు. శిథిలాల కింద చాలా మంది వరకు చిక్కుకుని ఉన్నారని, ఇప్పటికే చాలా మందిని బయటకు తీసినట్లు తెలిపారు. ఘటన స్థలానికి మూడు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను తరలించినట్లు ఆయన తెలిపారు. అయితే భారీ వర్షాల కారణంగా ఈ భవనం కూలినట్లు అధికారులు భావిస్తున్నారు. గత నెలలో కూడా కురిసిన భారీ వర్షాల కారణంగా ముంబాయిలోని ఓ భవనం కూలి 9 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. ఘటన స్థలంలో దమ్ము, ధూళి దట్టంగా అలుముకున్నాయి.

Building Collapsed In Raigad2Next Story
Share it