నాచారంలో భారీ అగ్నిప్రమాదం
By తోట వంశీ కుమార్ Published on 2 Aug 2020 12:08 PM GMTహైదరాబాద్‌లోని నాచారంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నాచారం పారిశ్రామిక వాడలోని రబ్బర్ పరిశ్రమలో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. రబ్బరు పరిశ్రమలో మంటలు ఎలా అంటుకున్నాయి అన్న సంగతి తెలియరాలేదు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story