గోదాంలో భారీ అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మైలార్ దేవునిపల్లి సమీపంలో పాడైపోయిన రబ్బర్ టైర్ల గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. గోదాంలో పెద్ద ఎత్తున మండలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో ప్లాస్టిక్‌ గోదాంకు మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ప్రమాద స్థలానికి చేరుకున్న సిబ్బంది, ఐదు అగ్నిమాపక శకటాలతో వచ్చి మంటలను ఆర్పివేశారు. కాగా, ఎలాంటి అనుమతులు లేకుండా గోదాములను ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదంలో ఎంత ఆస్తినష్టం వాటిల్లిందో తెలియాల్సి ఉంది.

దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న గోదాం నిర్వాహకులపై చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ హానీ జరగలేదు. షార్ట్‌ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అండదండలతో ఈ గోదాం నడుస్తున్నట్లు సమాచారం.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.