జైరాజ్‌ స్టీల్‌ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..

By Newsmeter.Network  Published on  13 Jan 2020 5:54 AM GMT
జైరాజ్‌ స్టీల్‌ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..

హైదరాబాద్‌: నగరంలోని జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పారిశ్రామిక వాడలోని జైరాజ్‌ స్టీల్‌ కంపెనీలోని బాయిలర్‌లో బ్లాస్ట్‌ జరగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయంతో కార్మికాకులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఆరు పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన వారు ఉత్తరప్రదేశ్‌, బీహార్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బాధితులను సదరు స్టీల్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇలాంటి అగ్ని ప్రమాదాలు జీడిమెట్ల పారిశ్రామిక వాడలో తరచూ జరుగుతున్నాయి. ఎంతో మంది పోట్టకూటి కోసం ఇక్కడి పరిశ్రమల్లో ప్రాణాలను లెక్క చేయకుండా పని చేస్తున్నారు. నిబంధనలు, కార్మికుల రక్షణపై ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పోలీసులు కూడా ఈ అగ్ని ప్రమాదాలను అంతంతమాత్రంగానే చూస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమానులపై పోలీసులు కేసులు నమోదు చేయడానికి శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. కారణం.. ఫ్యాక్టరీ యజయానుల వెనుక బడా నేతల హస్తం ఉండడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఫ్యాక్టరీల్లో ప్రమాదాలను నియంత్రించేలా వ్యవస్థలను ఏర్పాటు చేయడం లేదు. దీంతో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులతో పాటు, కార్మికుల ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పారిశ్రామిక ప్రదేశాల్లో తగిన చర్యలు చేపట్టాలని పలువురు కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story