మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోల్డెన్‌ హోటల్‌లో ఈ ప్రమాదం సంభవించింది. లోపల ఎంత మంది ఉన్నారన్నది తెలియరావడంలేదు. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హోటల్ లో చిక్కుకున్న వారిని బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.