చిత్తూరులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో చోటు చేసుకున్న ఈ అగ్నిప్రమాదం.. రికార్డులు భద్రపరిచే గదిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్లో రికార్డులన్నీ పూర్తిగా దగ్ధం అయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. అగ్నిప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.