కీచక తండ్రి.. కూతుళ్లపై లైంగిక దాడి..

By సుభాష్  Published on  30 Dec 2019 9:55 AM GMT
కీచక తండ్రి.. కూతుళ్లపై లైంగిక దాడి..

ఓ కీచక తండ్రి తన ఇద్దరు కూతుళ్లపై లైంగిక దాడికి దిగాడు. ఇంటి వద్దే ఉంటున్న ఇద్దరు కూతుళ్లపై ఈ దుర్మార్గుడు ఆరు నెలలుగా లైంగికంగా వేధిస్తూ నరకం చూపిస్తున్నాడు. సొంతబిడ్డలను అక్కుచేర్చుకోవల్సిన ఈ కీచక తండ్రి .. ఈ దారుణం చేశాడని తెలిసిన ప్రతి ఒక్కరు నివ్వెరపోతున్నారు.

సూర్యాపేట జిల్లా, కోదాడలలో ఈ దారుణం చోటు చేసుకుంది. గత ఆరు నెలలుగా ఈ దారుణానికి పాల్పడుతున్న విషయం తల్లికి చెప్పడంతో, ఆమె భర్తను నిలదీసింది. ఇక నుంచి అలాంటివేమి చేయనని, తప్పు అయిపోయిందంటూ ప్రాదేయపడటంతో వదిలేశారు. కాని ఈ కామంధుడి తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. మళ్లీ లైంగికంగా వేధించసాగాడు. ఈక్రమంలో చిన్న కూతురు మైనర్‌ అని చూడకుండా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఈ నీచుడు. చివకు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వీరు కోదాడలోని కట్టకొమ్ముగూడెం రోడ్డులో నివాసం ఉంటున్నారు. ఇక పెద్ద కుమార్తెకు 2016లో వివాహం కాగా, ఆమెకు రెండు సంవత్సరాల కూతురు కూడా ఉంది. భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు కావడంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. తల్లి కూలీ పనులకు వెళ్లిన సమయంలో తండ్రి ఆమెపై లైంగికంగా వేధించసాగాడు. అంతేకాకుండా మైనర్‌ అయిన చిన్న కూతురుని లైంగికంగా వేధించసాగాడు. ఇక చేసేదేమి లేక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కామాంధున్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరి ఇలాంటి కామాంధుడిని ఎలాంటి శిక్ష విధిస్తారో వేచి చూడాల్సిందే.

Next Story
Share it