కామారెడ్డి జిల్లాలో విషాదం: వడదెబ్బతో రైతు మృతి

By సుభాష్  Published on  29 April 2020 12:48 PM IST
కామారెడ్డి జిల్లాలో విషాదం: వడదెబ్బతో రైతు మృతి

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బీబీపేట మండలం యాడారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వడదెబ్బతో రైతు మృతి చెందాడు. చాకలి దేవరాజు (46) అనే కౌలు రైతు కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని ఆరబెట్టాడు. మధ్యాహ్నం ధాన్యం కుప్ప చేస్తుండగా దేవరాజు కుప్పకూలిపోయాడు. వడదెబ్బ కారణంతోనే రైతు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అల్పపీడనం కారణంగా అకాల వర్షం నుంచి తన ధాన్యాన్ని కాపాడుకుకోవాలనే ఆశతో ధాన్యాన్ని కుప్పచేస్తుండగా మరణించాడు.

అలాగే కామారెడ్డి జిల్లాలో రైతుల మృతి రెండుకు చేరింది. ఇప్పటికే లింగంపేట మండలం పొల్కంపేట ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్న భూమయ్య అనే రైతు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దనే గుండెపోటుతో మృతి చెందాడు.

Next Story