ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య..?

By సుభాష్  Published on  5 Oct 2020 6:45 AM GMT
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య..?

కృష్ణా జిల్లాలోని ముగ్గురు వ్యాపారులు అనుమానస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. జిల్లాలోని విస్సన్నపేట శివారులోని చెట్ల పొదల్లో సోమవారం ఉదయం మూడు మృతదేహాలను అక్కడి స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుల్లో ఓ మహిళ, యువతి కూడా ఉన్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించినట్లు తెలుస్తోంది. మృతులు సంచార చిరువ్యాపారులుగా పని చేసేవారని స్థానికులు చెబుతున్నారు. అనుమానస్పద మరణాలుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయితే చెట్ల పొదల్లో ముగ్గురి మృతదేహాలు లభించడంతో పలు అనుమానాలకు దారి తీస్తోంది. మృతులు నూజివీడు మండలం కొత్త ఈదర గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు చిన్నస్వామి, తిరుపతమ్మ, మీనాక్షిలుగా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే వారి మృతదేహాల పక్కనే ఓ ట్రాలీ ఆటో కూడా ఉంది. వీరిని ఎవరైనా హత్య ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.

Next Story
Share it